అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు..
సమావేశం నిర్వహించిన కార్పొరేట్ విద్యా నియంత్రణ మండలి సభ్యులు..
శుక్రవారం రోజున హస్తినాపురం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు జన్మదిన వేడుకలు జరిగాయి.. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున హాజరై.. అంతరాలు లేని విద్య కోసం నిరంతరం శ్రమిస్తున్న చెన్నోజు శ్రీనివాసులు సేవలను కొనియాడారు. .
అనంతరం వనస్థలిపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంగుల నరసింహారెడ్డి, నందిగామ వెంకటేష్, చామకూర రాజు, బొమ్మ రఘురామయ్, కెవి గౌడ్, బోయపల్లి లింగస్వామి, సాయికుమార్, కాశీనాథ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


