ఆదివారం పొరపాటున కూడా వీటిని తినొద్దు..
హిందూ మతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. అదే విధంగా ఆదివారం రోజు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ఆరోగ్యం కోసం నవ గ్రహాల అధిపతి అయిన సూర్యుడిని పూజిస్తారు. అయితే ఆదివారం రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయవద్దు.. అంతేకాదు కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకోకూడదు. ఈ రోజు ఆదివారం తినకూడని ఆహార పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం..
ఆదివారం అంటే ఇప్పుడు చాలా మందికి నాన్ వెజ్ తినే రోజుగా మారిపోయింది. అయితే హిందూ సనాతన ధర్మంలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే చాలా మందికి తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో పెద్దగా పట్టించుకోరు. కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినడం వలన సూర్యుడికి కోపం వస్తుందని నమ్మకం. ముఖ్యంగా ఎవరి జాతకంలో నైనా సూర్యుడు స్థానం సరిగ్గా లేకపోయినా, సూర్యుడు చెడు స్థానంలో ఉన్నా ఆదివారాలు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది.
ఆదివారం రోజున ఉల్లి వెల్లుల్లిని తినే ఆహారంలో లేకుండా చూసుకోవాలి. ఉల్లిపాయలను, వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి మంచిదే. .. అయితే ఆదివారం తినడం వలన అనారోగ్యానికి కారణం అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఆదివారం రోజున చిక్కుడు, బీన్స్ వంటి వాటిని తీసుకోవద్దు. ఆదివారం రోజున పాలకూరని కూడా తినకూడదు. పాలకూరని ఆదివారం తినడం అశుభమని నమ్మకం. ఆదివారం చేపలని కూడా తినొద్దు. చాలా మంది ఆదివారం అంటే నాన్ వెజ్ తినే రోజుగా భావిస్తారు. మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే చేపలు తినడం అశుభం అని చెబుతున్నారు.