రవాణా, రెవెన్యూ , ఎస్సీ ఎస్టీ మంత్రుల ఆధ్వర్యంలో కార్యక్రమం..
సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..
మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించడం జరిగింది.
గురుకులాలు ఇతర సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూళ్లలో పరిసరాల పరిశుభ్రత, శుభ్రమైన నీటి సరఫరా శుద్ధి తాగునీటి వసతి కల్పించడం ఆహార పరిశుభ్రత స్వచ్ఛమైన ఆహారం అందించడానికి కావలసినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించవలెను, అలాగే గురుకులాలు సంక్షేమ హాస్టల్లో పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలు గడ్డి వంటివి పెరగకుండా చూసి పాముకాటు వంటి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టవలెను. గురుకులాలు సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలలో స్వచ్ఛమైన ఆహారం అందించడానికి ఆరోగ్య శిబిరాలు నిర్వహించడానికి పరిసరాల పరిశుభ్రత పాటించడానికి చర్యలు చేపట్టాలి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలి, ఇట్టి విషయాలను పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి కమిటీ మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయవలెనని మంత్రి ఆదేశించినారు.
అలాగే శుభ్రమైన ఆహార పదార్థాలను అందించడానికి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించడానికి కలుషిత ఆహారం ద్వారా వ్యాధులు సోకకుండా ఫుడ్ పాయిజన్ సమస్యను నివారించడానికి శానిటేషన్ సిబ్బందికి, వంటగదిలో పని చేసే సిబ్బందికి తగిన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు.
అడిషనల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఇట్టి కమిటీల ఏర్పాటు పట్ల ప్రత్యేక వహించి తరచుగా ఆకస్మిక తనిఖీలు చేయవలెనని సూచించడం జరిగింది. జిల్లా కలెక్టర్ మండల స్థాయి కమిటీలకు ఒక అధికారిని నామినేట్ చేయవలెనని తెలిపినారు. రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి, మండల స్థాయిలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి అధికారులకు సిబ్బందికి పరిశుభ్రత స్వచ్ఛమైన ఆహారం పరిశుద్ధమైన మంచినీటి సరఫరా గురించి అవగాహన కల్పించవలెనని తెలియజేయడం జరిగింది.
ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రెసిడెన్షియల్ స్కూల్స్ సంక్షేమ హాస్టల్లో మైనార్టీ హాస్టల్లో డైట్ పట్ల, కోడిగుడ్ల కొనుగోలు వంటి విషయాల పట్ల జిల్లా అధికారులు తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. వంట పాత్రలు స్టెయిన్లెస్ స్టీల్ వి వాడాలని సూచించారు. ప్రతి హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్ లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు వైద్య సిబ్బంది ద్వారా తరచుగా ఆరోగ్య శిబిరాలు ఆరోగ్యపరీక్షలు ఏర్పాటు చేయవలెను అని సూచించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ భారతి, ధరణి పోర్టల్ సమస్యల, భూ సమస్యల గురించి సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పట్ల 8 లక్షల పైచిలుకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఇట్టి విషయంలో కోర్టు కేసు పరిధిలో ఉన్న వదిలిపెట్టి మిగతావి త్వరగా పూర్తిచేయాలి. అసైన్మెంట్ ల్యాండ్స్ పంపిణీలో ప్రత్యేక శ్రద్ధ వహించి కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే అసైన్మెంట్ భూముల పంపిణీ ప్రక్రియ చేయాలని సూచించారు.ఇతర వ్యాపార అవసరాల కోసం అసైన్మెంట్ ల్యాండ్ పంపిణీ చేయకూడదని తెలిపినారు. ఈ నెలాఖరులోపు అన్ని జిల్లాల్లో గల అసైన్మెంట్ ల్యాండ్ యొక్క వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రైతుల, సాధారణ ప్రజల యొక్క భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యల విషయంలో ఎవరైనా మండలాధికారులు గాని ఇతర అధికారులు రైతులను గాని ప్రజలను గాని ఇబ్బంది పెట్టినట్లు తమ దృష్టికి వస్తే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి గురించి సమీక్ష లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గాను కావలసినటువంటి ఇసుక సేకరణ విషయంలో వివిధ జిల్లాల్లో కొన్ని సమస్యలు తలెత్తిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలుపుతూ ఇలాంటి సమస్యలు అధిగమించడానికి సమీప జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు దగ్గర ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతాల నుండి ఇసుక సేకరణ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఇసుక సేకరణ గురించి సమస్యలు రాకుండా కలెక్టర్లు ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో 57 వేల ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పాత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో 60000 గ్రామీణ ప్రాంతాల్లో 40, 000 ఉన్నాయి. వీటిని పరిశీలించి లబ్ధిదారులకు మంజూరు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు డబ్బులు మంజూరు బదిలీచేసే విషయంలో బ్యాంక్ సమస్యలు ఇతర ట్రాన్సాక్షన్ సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించినారు. వన మహోత్సవం గురించి అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. మొక్కలు నాటడం, వనమహోత్సవంలో పాల్గొనడం అందరి సామాజిక బాధ్యత అని తెలియజేసినారు. వనమహోత్సవం కార్యక్రమంలో విద్యాశాఖ పాఠశాలలు కళాశాలలు ఇతర అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు ఉద్యోగులు వివిధ సిబ్బంది పాల్గొనాలని సూచించారు. గౌడ సంఘాలతో చర్చించి ఈత చెట్లు నాటడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వన మహోత్సవంలో గత సంవత్సరంలో 85% ప్రగతి సాధించినాము, అట్టి ప్రగతి ఈ సంవత్సరం 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఐ.టి.ఐ. లను ఏ.టి.సి లను అప్ గ్రేడ్ చేయడం గురించి, ఐ.టి.ఐ.లలో ఏటిసి సంస్థల్లో ప్రవేశాలు పెంచడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. దివ్యాంగుల కోసం 50 కోట్ల రూపాయల పరికరాలు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రివర్యులు తెలిపినారు. ఇట్టి వీడియో కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు తమ క్షేత్రస్థాయి పర్యటనలో మండల స్థాయిలో సంక్షేమ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పాఠశాలలో తప్పకుండా సందర్శించి వాటిలో ఆహార భద్రత పరిసరాల పరిశుభ్రత నాణ్యమైన ఆహారం పరిశు వసతి గురించి పర్యవేక్షణ చేయాలని తెలిపినారు.
అలాగే విద్యార్థులు పాముకాటు ప్రమాదాలకు గురికాకుండా హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులాల సమీపంలో ఉన్నటువంటి గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వన మహోత్సవం కార్యక్రమంలో ప్రగతి సాధించినప్పటికీ ఇట్టి నివేదికలు ఆన్లైన్లో ఎంట్రీ కావడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కారం వంటి అంశాల పట్ల సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే తమ కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అడిషనల్ కలెక్టర్ చందర్, డి ఎఫ్ ఓ నికిత, ఆర్డీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.