ఏపీలో ప్రముఖ సాంకేతిక శిక్ష సంస్థ బ్లాక్ బాక్స్..
తమ సంస్థ గురించి వివరించిన పేరూరు బాలకృష్ణ..
ప్రముఖ సాంకేతిక శిక్షణ సంస్థ బ్లాక్ బక్స్ ప్రతినిధి పేరూరు బాలకృష్ణ అనంతపురం జె.ఎన్.టి.యు. వైస్ ఛాన్సలర్ డా. సుదర్శన్ రావు ను బుధవారం నాడు ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు… ప్రముఖ సాంకేతి నిపుణురాలు తోట అనురాధ ఆధ్వర్యంలో గత పండ్రెండు ఏళ్లుగా విజయవంతంగా నిర్వహించ బడుతున్న బ్లాక్ బక్స్ సంస్థ గురించి ఆయన వీసీ కి వివరించారు…. గత కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిటెక్ పట్టభద్రులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారు విజయం సాధించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు…పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో సాంకేతిక శిక్షణ ఇస్తూ వారు కళాశాల ప్రాంగణ ఎంపికలో ఉద్యోగం సాధించేలా విద్యార్థుల ను తయారు చేస్తున్నట్లు తెలిపారు… అత్యాధునిక ఏఐ అనుసంధాన శిక్షణ పొందిన నిపుణుల బృందం ద్వారా విద్యార్థుల కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన వీసీ కి వివరించారు.


