పలు సమస్యలు ఆయన దృష్టికి తెచ్చిన కాలనీ వాసులు..
సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మొద్దు లచ్చిరెడ్డి..
మంగళవారం రోజు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కాలనీలో పర్యటించడం జరిగింది.
ఈ సందర్భంగా కాలనీలో వర్షపు నీరు రోడ్లపై చేరి నీరు నిల్వ ఉంటుందని వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయించాలని, కాలనీలో కొంతమేర రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని, వీధి దీపాలు పెట్టించాలని కాలనీ సభ్యులు కార్పొరేటర్ ని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… త్వరలోనే కాలనీలో ఒకటొకటిగా ప్రతి సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యాదగిరి, ప్రతాప్, సుధాకర్ రావు, మల్లారెడ్డి, బుచ్చిరెడ్డి, దయాకర్ రెడ్డి, నరేందర్, శ్యామ్ సుందర్ రెడ్డి, మల్లారెడ్డి, యాదయ్య, వీరేష్ గౌడ్, లక్ష్మీనారాయణ రెడ్డి, పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..