ఆ దిశగా చర్యలు తీసుకుంటాం..
వెల్లడించిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..
శుక్రవారం రోజు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్ రోడ్ నెంబర్ 4/1లో నూతన డ్రైనేజ్ పైప్ లైన్ పనులను బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం సాయిబాబా గుడి వద్ద నుంచి శివాలయం వరకు నిర్మాణం చేస్తున్న సిసి రోడ్ పనులను పర్యవేక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దిశలవారీగా కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కాలనీ వాసులకు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సిరివెన్నెల, ఇంజనీరింగ్ భాగం ఏఈ గోపాలకృష్ణ, కాలనీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు సిహెచ్ మల్లేశం, కార్యవర్గ సభ్యులు ఎన్ వెంకటేశ్వర్లు, నామ కోటేష్, కోశాధికారి శివరాం ప్రసాద్, క్లియర్ టేకర్ బయన్న, జాయింట్ సెక్రెటరీ జంగారెడ్డి, రామన్ చౌదరి, మినేష్, వినోద్, భాస్కర రావు, డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..