స్థానిక కార్పొరేటర్ కు విజ్ఞప్తి చేసిన వెంకటేశ్వర కాలనీ సభ్యులు..
సహకరిస్తానని, తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మొద్దు లచ్చిరెడ్డి..
బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాయత్రినగర్ బ్యాంకు కాలనీలో పోచమ్మ – ఎల్లమ్మ దేవాలయం పైన ఉన్న రేకుల షెడ్డును రెండు రోజుల క్రితం హయత్ నగర్ ఎమ్మార్వో తన సిబ్బంది తో కలిసి కూలగొట్టిన విషయం గురించి సోమవారం రోజు వెంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు యధావిధిగా రేకుల షెడ్డును పునర్నిర్మాణం కొరకు సహకరించాలని కోరుతూ బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డిని వారి కార్యాలయంలో కలవడం జరిగింది.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దేవాలయం మీద ఉన్న రేకుల షెడ్డును యధావిధిగా నిర్మించుకునేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని.. ఈ విషయంపై హయత్ నగర్ ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేసి.. దేవాలయంపైన రేకుల షెడ్డు నిర్మించుకునేందుకు ఎలాంటి అవరోధాలు లేకుండా సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు కృష్ణ, సౌభాగ్యనగర్ కాలనీ మాజీ అధ్యక్షులు నందకిషోర్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..