Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణనాలా ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా

నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా

మూడు కాల‌నీల‌కు త‌ప్పిన ముంపు బెడ‌ద‌..
కూకట్ పల్లి మండలం ఏవీబీ పురంలో కార్యక్రమం..

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా, కూక‌ట్‌ప‌ల్లి మండ‌లంలోని ఏవీబీపురంలో నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా సోమ‌వారం తొల‌గించింది. ప‌రికి చెరువు నుంచి కూక‌ట్‌ప‌ల్లి నాలాలో క‌లిసిన దీని వెడ‌ల్పు 10 మీట‌ర్లు కాగా.. 3 మీట‌ర్ల‌కు పైగా క‌బ్జాకు గురైంది. ఈ నాలాపైన రెండు ష‌ట్ట‌ర్లు వెలిశాయి. నాలానే కాకుండా.. మ్యాన్‌హోల్‌పైన కూడా నిర్మాణాలు చేప‌ట్టారు. ఇందులో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల విక్ర‌యాలు, మ‌ర‌మ్మ‌తులు చేస్తున్నారు. నాలా ఆక్ర‌మ‌ణ‌తో సాయిబాబాకాల‌నీ, హెచ్ ఏ ఎల్ కాల‌నీ, మైత్రిన‌గ‌ర్‌లో వ‌ర‌ద ముంచెత్తుతోంది. ఏమాత్రం వ‌ర్షం ప‌డిన పై నుంచి వ‌చ్చే వ‌ర‌ద సాఫీగా సాగ‌క‌.. త‌మ ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని కాల‌నీవాసులు ఫిర్యాదు చేయ‌డంతో జ‌ల‌మండ‌లి అధికారులు కూడా ప‌రిశీలించారు. జ‌ల‌మండ‌లి అధికారుల నివేదిక మేర‌కు హైడ్రా ఈ కూల్చివేత‌లు చేప‌ట్టింది. దీంతో కాల‌నీవాసులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments