Saturday, June 21, 2025
Google search engine
Homeస్పోర్ట్స్నా మనవాళ్ళు మానవరాళ్లకు బుమ్రా గురించి చెబుతాను:ట్రావిస్ హెడ్

నా మనవాళ్ళు మానవరాళ్లకు బుమ్రా గురించి చెబుతాను:ట్రావిస్ హెడ్

ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ భారత స్టార్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలతో ముంచెత్తాడు. జస్ప్రీత్ బుమ్రా క్రికెట్లో ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలుస్తాడని, అతన్ని ఎదుర్కొవడం అతి పెద్ద సవాలుగా మారిందని అన్నాడు.అయితే అది తన కెరీర్‌లో గర్వంగా చెప్పుకోదగిన విషయమని తన మనవాళ్ళు మానవరాళ్లకు బుమ్రా గురించి చెబుతాను అని హెడ్ పేర్కొన్నాడు.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా తన ప్రదర్శనతో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు.తన ఫాస్ట్ బౌలింగ్ తో ఆస్ట్రేలియా బ్యాటర్లకు వణుకు పుట్టించాడు.
ఆస్ట్రేలియన్ జట్టు ఇప్పుడు తన తర్వాతి పింక్ బాల్ టెస్టును ఆడడానికి సిద్ధమవుతోంది. గత సిరీస్‌లలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను అధిగమించిన తమ సామర్థ్యం గురించి హెడ్ ధైర్యంగా మాట్లాడాడు. “ఈ జట్టు ప్రతికూల పరిస్థితులను చక్కగా ఎదుర్కొంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా, మేము సవాళ్లకు ఎదురు నిలిచి విజయాలను సాధించాము. పెర్త్ మ్యాచ్‌లో ఓడిపోయినా, మిగిలిన సిరీస్‌లో తాము తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తామని. అని హెడ్ చెప్పాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments