ములుగు జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనం..
అధ్యక్షత వహించిన జిల్లా గ్రంధాలయ చైర్మన్..
ములుగు జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో హాజరై మంత్రి సీతక్క మాట్లాడారు. అందరికీ కూడు గూడు గుడ్డతోపాటు విద్య చాలా అవసరమని అన్ని హంగులతో నూతన గ్రంథాలయాన్ని రూ.25 లక్షలతో నిర్మించామని అన్నారు. విద్యాలయాలు, లైబ్రరీలు అందరికీ ఉపయోగపడేలా ఆధునికరణ పనులు చేపట్టామని తెలిపారు. లైబ్రరీలతో ఉన్నత స్థాయికి ఎదిగిన తిరిగి లైబ్రరీకి పుస్తకాలను అందించాలని అన్నారు.
అంతే కాకుండా జిల్లాకు వచ్చేవారికి పర్యాటక ప్రాంతాలు వాటి అభివృద్ధి అక్కడికి వెళ్ళేందుకు మార్గాలను సూచించే సమాచారాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కట్టుబడి పనులు జరుగుతున్నాయని వాటిని పూర్తి చేస్తామని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో పచ్చదనంతో కళకళలాడే విధంగా రోడ్ల అభివృద్ధి చేపడుతున్నామని మంత్రి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ములుగు కూరగాయల మార్కెట్ అభివృద్ధి కోసం విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తామని, బస్టాండ్ ఆధునికీకరణ చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఐటీ అభివృద్ధి కోసం రెండు కంపెనీల ద్వారా 80 మందికి శిక్షణ ఇచ్చి వారిలో 79 మంది ఉద్యోగాలు పొందారని అన్నారు. ములుగు జిల్లాలు అన్ని రకాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.
అనంతరం జిల్లా కేంద్రంలో ములుగు బ్రాంచి డిసిసి బ్యాంకు నూతన ప్రాంగణ ప్రవేశమును, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు,, అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణిలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి అలివేలు, మున్సిపల్ కమిషనర్ జనగాం సంపత్, డి సి ఓ సర్దార్ సింగ్, డిసిసి బ్యాంక్ మేనేజర్ పెళ్లి తిరుపతి, పాలకవర్గ సభ్యులు రమేష్, దొంగలముఠా కొండ నరేందర్, లోకల్ ఫాక్స్ చైర్మన్స్ ఒక్క సత్తిరెడ్డి, కాసర్ల కుమారస్వామి ఎల్లారెడ్డి, డిసిసి బ్యాంక్ అధికారులు సీఈవో వజీర్ సుల్తాన్, డీజీఎం జంపాల అశోక్, నోడల్ ఆఫీసర్ గంప స్రవంతి, బ్యాంకు సిబ్బంది, అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు, గ్రంథాలయ సిబ్బంది ఎస్ నిఖిల్, సమ్మక్క, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, పాఠకులు,
తదితరులు పాల్గొన్నారు.