బడంగ్ పేట్ మున్సిపల్ బాలాపూర్ వైబీఆర్ ఫంక్షన్ హాల్ లో కార్యక్రమం..
ముఖ్యఅతిథులుగా హాజరీఅం మంత్రి స్రేధర్ బాబు, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి..
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి..

మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల బాలాపూర్ వైబీఆర్ ఫంక్షన్ హాల్ లో ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి.. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.