ఎల్బీనగర్:
నేటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయని సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ శ్యామల తెలిపారు. ప్రథమ సంవత్సరం 520 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 550 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, కళాశాల ఆవరణలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 నిమిషాలు ఆలస్యంగా మాత్రమే అనుమతి ఇస్తామని, తరువాత వచ్చిన వారిని పరీక్షకు అనుమతించమని,ఈ పరీక్షల నిర్వహణలో 27 మంది ఇన్విజిలేటర్లు పాల్గొన్నారని, ఇన్విజిలేటర్లకు సమావేశం కూడా ముందు రోజే నిర్వహించామని వివరించారు.


