కార్యక్రమాన్ని చేపట్టిన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్..
కార్యక్రమాన్ని ప్రారంభించిన మీనాక్షి నటరాజన్..
పాల్గొన్న రంజిత్ రెడ్డి, కె.ఎల్.ఆర్., కప్పాటి పాండురంగా రెడ్డి..
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ వికారాబాద్ జిల్లా పరగి నియోజకవర్గంలో ప్రారంభించారు.. ఈ జనహిత పాదయాత్రలో మాజీ చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి, సీనియర్ నాయకులు అందుగుల సత్యనారాయణ, సభావట్ గణేష్ నాయక్, కంబాల పల్లి మదన్ పాల్ రెడ్డి, వుండల బాబూరావు, ఎగ్గిడి కృష్ణ మహేందర్ తదితరాలు పాల్గొన్నారు.