Home తెలంగాణ పోలీసు సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిబిరం

పోలీసు సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిబిరం

0
3

ఎల్బీనగర్:

మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సోమవారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఒమేగా, ఫోర్ట్ డెంటల్, డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.

​నిర్వహించిన పరీక్షలు:
శిబిరంలో సిబ్బందికి లిపిడ్ ప్రొఫైల్, బీఎండీ (ఎముకల సాంద్రత), రక్తపోటు (బీపీ), షుగర్ (ఆర్‌బీఎస్), ఈసీజీ, 2డీ-ఎకో పరీక్షలు చేశారు. ప్రత్యేకించి 45 ఏళ్లు పైబడిన పురుషులకు పీఎస్‌ఏ, 40 ఏళ్లు పైబడిన మహిళలకు పాప్‌ స్మియర్, మేమోగ్రామ్ వంటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఫోర్ట్ డెంటల్ వైద్యులు దంత పరీక్షలు, అగర్వాల్ ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు చేశారు.
​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. నిరంతరం విధుల్లో నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించి చికిత్స పొందవచ్చని సూచించారు. ముఖ్యంగా మహిళా సిబ్బంది క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ వైద్య శిబిరం మంగళవారం కూడా కొనసాగుతుందని తెలిపారు.
​కార్యక్రమంలో డీసీపీ (అడ్మిన్) ఇందిరా, యూనిట్ వైద్యులు సరిత, అచ్యుతరావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here