Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణప్రతి గల్లీని క్లీన్ గా ఉంచడమే ఫ్రీ మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశ్యం..

ప్రతి గల్లీని క్లీన్ గా ఉంచడమే ఫ్రీ మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశ్యం..

వెల్లడించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

ప్రతి గల్లీని క్లీన్ గా తీర్చిదిద్దడమే ఫ్రీ మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశ్యమని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. హైదరాబాద్ నగరాన్ని క్లీన్ గా ఉంచడమే ధ్యేయంగా ఫ్రీ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ ను నగర్ వ్యాప్తంగా ఉన్న 150 వార్డులో యుద్ధ ప్రాతిపదికన కొనసాగించడం జరుగుతుందన్నారు. ఫ్రీ మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మంగళవారం ఎల్బీనగర్ జోన్ లోని కార్పొరేటర్లు, అధికారులతో మేయర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ఒక్కొక్క వార్డులో మూడు లేదా నాలుగు రోజుల్లో గల్లీ గల్లీ క్లీన్ చేయడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క వార్డును పూర్తి చేసిన తర్వాత ప్రజలు చెత్త బయట వేసిన సందర్భంలో ఫైన్ వేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛ ఆటోతో లింక్ చేయడం జరిగిందని, వారు స్వచ్ఛ ఆటో డ్రైవర్ కు నెల నెల నిర్దేశించిన రుసుం ఇవ్వకున్నా తప్పనిసరిగా స్వచ్ఛ ఆటో కే వేసే విధంగా డిప్యూటీ కమిషనర్లు, శానిటేషన్ అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారని మేయర్ తెలిపారు. చెత్తతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలు డ్రైనేజీ క్లీనింగ్ కూడా చేస్తారని, ఈ విషయంలో జలమండలి అధికారులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ముందస్తు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ వలన పరిశుభ్రత వలన ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలందరూ సహకరించాలని మేయర్ కోరారు.

ఎల్బీనగర్ నగర్ జోన్ లో కార్పొరేటర్లు, అధికారులతో సమావేశం అనంతరం మేయర్ మీడియా తో మాట్లాడుతూ… కార్పొరేటర్లు వారి వారి వార్డులో ఉన్న సమస్యలను విన్నవించారని, వాటిని యుద్ధ ప్రాతిపదిక పరిష్కారం చేస్తామన్నారు. ముఖ్యంగా పార్కుల అభివృద్ధి శానిటేషన్, స్టార్మ్ వాటర్ నాలా,  నాలా అభివృద్ధి, సిసి రోడ్ల సమస్యలు విన్నవించారని, కొన్ని సమస్యలు జోనల్ స్థాయిలో పరిష్కారం అయ్యే అవకాశం ఉందని మరికొన్ని హెడ్ ఆఫీస్ పరిధిలో ఉన్నాయని, తాను జీహెచ్ఎంసీ కమిషనర్, వివిధ విభాగాల  హెచ్ఓడి లతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైతే ప్రభుత్వ దృష్టి తీసుకుపోతామన్నారు. ముఖ్యంగా కొన్ని కాలనీలు పెరుగుతున్న నేపథ్యంలో శానిటేషన్ కార్మికుల సంఖ్య పెంచాలని కోరారని చెప్పారు. అదే విధంగా ఎస్.ఎఫ్.ఏ లు దీర్ఘకాలికంగా ఒకే చోట పని చేస్తున్నారని, వారిని బదిలీ చేయాలని మెజారిటీ కార్పొరేటర్లు కోరినట్లు మేయర్ వివరించారు. వీధి లైట్ల పై కూడా సమస్యలు విన్నవించారని, గతంలో ఉన్న ఈ ఈ ఎస్ ఎల్ కాంట్రాక్ట్ పూర్తి అయినందున వారి సబ్ కాంట్రాక్టర్లలతో కొంత కాలం జిహెచ్ఎంసి నిర్వహిస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు విద్యుత్ శాఖ నుండి వచ్చిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ లు డిప్యూటేషన్ పై రావడంతో వారికి జీతాలు ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారని, అయినా వారితో ఏమి లాభం లేకుండా పోతున్నారని, వీధి దీపాల నిర్వహణ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ కు బాధ్యత ఇవ్వాలని కోరారు. త్వరలో కమిషనర్ స్టాండింగ్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి పనిలో అధికారులు కార్పొరేటర్లను ఇన్వాల్వ్ చేయాలని, ఏ పని చేపట్టిన కార్పొరేటర్ల కు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మేయర్ వెల్లడించారు. కుక్కల బెడద నివారణకు అన్ని చర్యలు తీసుకున్నట్లు దేశంలో మరెక్కడా లేని విధంగా జీహెచ్ఎంసీ ఎక్కువ శాతం కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినట్లు వివరించారు. 

అంతకు ముందు జరిగిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ… ఎల్బీనగర్ జోన్ లో అధిక నిధులు మంజూరు చేసినట్లు అయినప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.  మేయర్ ఎల్బీనగర్ జోన్ కు వచ్చిన సందర్భంగా కార్పొరేటర్ ఒక్కరికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కార్పొరేటర్లు మేయర్ ను కోరారు. ఈ సమావేశంలో జోనల్ కమీషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ… కార్పొరేటర్ లు సూచించిన అంశాలను క్షేత్రస్థాయిలో,  పర్యటించి జోనల్ స్థాయిలో పరిష్కారం అయ్యే వాటికి పరిష్కరిస్తామని అవసరమైన నిధుల కోసం కమీషనర్ గారికి నివేదించడం జరుగుతుందన్నారు. 

ఈ సమావేశంలో ఎస్.ఈ అశోక్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ లు, కార్పొరేటర్లు కొప్పుల నరసింహ రెడ్డి, కె.నవజీవన రెడ్డి, ఎం.లచ్చి రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, వంగా మధుసూదన్ రెడ్డి, అరుణ, బానోతు సుజాత, ఆకుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments