లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం..
37 మంది లబ్ధిదారుల ఎంపిక చేసిన అధికారులు..
అర్హులైన ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించడమే ద్యేయం గా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మండల పరిధిలోని, సమితి సింగారం గ్రామ పంచాయితీ కార్యాలయ ఆవరణలో 37 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన పత్రాలను ఎమ్మెల్యే పాయం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, ప్రతి పేదోడికి సొంతంటి కలను సాకారం చేసి ఇందిరమ్మ ఆశయాలను నెరవేర్చుతామని పేర్కొన్నారు. లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్, సీనియర్ కాంగ్రెస్ నేతలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి తేళ్ళూరి శ్రీనివాసరావు, తహశీల్దార్ అద్దంకి నరేష్, ఎంపిఓ వెంకటేశ్వరరావు, పంచాయితీ కార్యదర్శులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


