రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి విమర్శలు..
గురువారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో పాండురంగా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గమనించాలని, బిఆర్ఎస్ అధికారంలో వుండగా కృష్ణా జలాల్లో తెలంగాణకు 36 శాతం చాలని, ఏపికి 64 శాతం తీసుకోవచ్చు అంటూ బిఆర్ఎస్ అదినేత నాటి ముఖ్యమంత్రి కెసిఅర్ తెలంగాణకు ద్రోహం చేసారని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే, కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు మరింత ఎక్కువ వాటా వచ్చేదని, తెలంగాణకు అదనంగా 220 టిఎంసిల నీటి వినియోగం పెరిగేదని అన్నారు..
కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం పేరుతో కూళేశ్వరం నిర్మాణం చేసి లక్ష కోట్ల ప్రజా దన్నాన్ని దుర్వినియోగం చేసి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అన్నారు.. తప్పులన్నీ బిఆర్ఎస్ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని బిఅర్ఎస్ చేస్తున్న విమర్శలను,తప్పుడు ప్రచారాలను ప్రజలు గ్రహించాలని పాండురంగా రెడ్డి కోరారు.