రెండు తెలుగు రాష్ట్రాల బీసీలు ఇకనైనా మేలుకోవాలి..
పిలుపునిచ్చిన బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ లందరూ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగవలసిన సమయం ఆసన్నమైందనీ మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఐక్యంగా ముందుకు సాగి మనకు రాజ్యాంగ పదంగా ధక్కవలసినటువంటి బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడం కొరకు ఐక్య ఉద్యమాలు చేయవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు అనడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అదే తరహాలో నేడు రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఉండబోతుందని ఆయన అన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం త్వరలోనే రహదారుల దిగ్బంధం, రోడ్లపై వంటా వార్పు కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీసీల రాజ్యమే ప్రతి బీసీ సోదరుడు పార్టీలకు అతీతంగా కలిసి ముందుకు సాగాలని అన్నారు అత్యధికంగా ఓట్లు ఉన్న బీసీలు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, కౌన్సిలర్ స్థానాలకే బీసీలు పరిమితం కాదు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ లు ఎమ్మెల్యేలు, ఎంపీలు గా ముఖ్యమంత్రి గా చేసే వరకు అందరం కలిసి గట్టిగా పోరాటం చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పట్టేటి రమేష్, శంకర్, గంగాధర్, రమేష్, కోటేష్, వీరస్వామి, ఉపేందర్, రవి తదితరులు పాల్గొన్నారు..