వెల్లడించిన కప్పాటి పాండు రంగారెడ్డి..
సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం..
సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అనే విషయం నాడు మర్రి చెన్నారెడ్డి నేడు రేవంత్ రెడ్డిలు నిరూపించారు, వారి నిర్ణయం, కాంగ్రెస్ అభిమతం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు అని అన్నారు కప్పటి పాండు రంగారెడ్డి.. ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ఎన్నికలలో ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణతో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ హామీ అమలుచేసి బీసీ వర్గాల ఆశయాలకు న్యాయం చేస్తూ 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాబినెట్ నిర్ణయం, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ కోటాకు అమోదం చారిత్రాత్మక నిర్ణయం.. దేశంలో ఎక్కడ లేనివిధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం. 2018 పంచాయతీరాజ్ చట్టం సవరణ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు.
రిజర్వేషన్ల అమలును జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యారోపనలు ప్రజలు పట్టించుకోరని బడుగులపై ప్రేముంటే ఇప్పటికైనా ప్రభుత్వానికి సహాకరించాలని పాండురంగా రెడ్డి అన్నారు.