ఫార్మాసిటీ రైతులకు సంబంధించిన వ్యవహారాల పరిశీలన..
దళారీల చేతుల్లో మోసపోకుండా వుండాలని సూచన..
ప్లాట్ల డిస్ట్రిబ్యూషన్ పారదర్శకంగా వుండాలని హెచ్చరిక..

సిపి రాచకొండ జి సుధీర్ బాబు ఐపీఎస్, గురువారం రోజు బెగరికంచ గ్రామంలోని ఏటీసీని సందర్శించడం జరిగింది. అక్కడ ఫార్మా సిటి రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్లాట్లను, దానికి ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించి అధికారులతో మాట్లాడారు.. హెల్ప్ డెస్క్ లను, గ్రీవిఎన్స్ కౌంటర్లను సిపి స్వయంగా పరిశీలించడమైనది.. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. పాట్లు డిస్ట్రిబ్యూషన్ పారదర్శకముగా ఉండాలని, దళారులతో మోసపోవద్దు అని రైతులకు సూచించారు.. ఎటువంటి గ్రీవెన్స్ వచ్చాయో కూడా రిజిస్టర్ను చెక్ చేసి ఏదైనా సమస్య వస్తే అధికారుల దృష్టికి తీసుకరావాలని.. దళారుల చేతిలో మోసపోకూడని రైతులకు సూచనలు చేశారు.. . శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేశాం అని ఆయన తెలిపారు. అనంతరం కొంతమంది రైతులతో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపి వెంట మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసిపి కేపీవీ రాజు, హైద్రాబాద్ గ్రీన్ ఫార్మసిటీ ఇన్స్పెక్టర్ లిక్కి కృష్ణం రాజు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు..