50 టీమ్ లీడర్ పోస్టులను ఆరోగ్య మిత్రాలకు కేటాయించాలని వినతి..
సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు కల్పించాలి..
మంగళవారం రోజు సెక్రటేరియట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహని కలిసి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 50 టీం లీడర్ పోస్టులను గత 18 సంవత్సరాలుగా ఆరోగ్య మిత్రాలుగా విధులు నిర్వహిస్తున్న వారికి సీనియార్టీ ఆధారంగా ప్రమోషన్స్ కల్పించిన తర్వాతనే కొత్త రిక్రూట్మెంట్ ను చేపట్టాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుమార్, ఉపాధ్యక్షులు సుమన్, హైదరాబాద్ అధ్యక్షులు రాజు, నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగరాజు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు రాసాల శ్రీనివాస్, వరంగల్ జిల్లా జనరల్ సెక్రెటరీ అనిల్ ,జనగాం జిల్లా మిత్ర రవీందర్, ఖమ్మం జిల్లా కిషోర్, హనుమకొండ జిల్లా నుండి రవీందర్, వజ్ర తదితరులు పాల్గొనడం జరిగింది.


