గణేష దర్శనానికి మంత్రికి ఆహ్వానం..
కార్యక్రమంలో మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి..
బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంచార్జీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి, బాలాపూర్ గణేశుని దర్శనానికి రావాల్సిందిగా బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆహ్వానించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి..
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, నేనావత్ బాలు నాయక్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్ళెం నిరంజన్ రెడ్డి, నాయకులు ఎల్మెటి అమరేందర్ రెడ్డి, ఎర్ర జైహింద్, బాలింగని జంగయ్య, టేకుల శశిధర్ రెడ్డి, టేకుల సుధాకర్ రెడ్డి, ఇక్కే శ్రీనివాస్, నరహరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


