44 టూ వీలర్స్, 4 ఆటోలు, రూ.25వేల విలువ గల మద్యం స్వాధీనం..
సరైన ధ్రువ పత్రాలు చూపించి వాహనాలు తీసుకువెళ్లండని ఆదేశాలు..
భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పట్టణంలోని మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల భగత్ సింగ్ నగర్ లో డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటలకు కమ్యూనిటీ కాంటాక్ట్ అండ్ కార్డున్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ స్థానికులతో మాట్లాడుతూ అనుమానస్పదంగా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిన వారికి ఇండ్లు అద్దెకు ఇచ్చిన వారి గురించి పూర్తిగా వివరాలు తెలుసుకొని ఇండ్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మణుగూరు ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వ్యక్తులు వస్తారని తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన వారు ఉపాధి ముసుగులో నిషేధిత గంజాయిని ఒడిస్సా రాష్ట్రాల నుండి తీసుకువచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. మత్తుకు బానిసైన వారు అసాంఘిక కార్యకలాపాలకు తెగబడతారని తెలియజేశారు. వారి వలన సన్మార్గంలో నడవాల్సిన యువత నిషేధిత గంజాయి మత్తులో జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు.

సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమాన స్పదంగా ఎవరైనా కన్పించిన, నిషేధిత గంజాయి క్రయవిక్రయాలు చేసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లేదా.. 100 డైల్ చేసిన పోలీసులు వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాని తెలిపారు. భగత్ సింగ్ నగర్ లో ఇంటింటికి తిరిగి వాహనాలు తనిఖీలు చేశారు. సరైన ధ్రువ పత్రాలు లేని 4 ఆటోలు, 44 ద్విచక్ర వాహనాలు, అధికార పార్టీకి చెందిన పట్టణ అధ్యక్షుడు నివాసంలో, మరో బెల్ట్ షాపులో అక్రమంగా నిల్వఉంచిన సుమారు రూ.25 వేల విలువ గల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ మీడియాకు తెలిపారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువ పత్రాలు పోలీస్ స్టేషన్లో సమర్పించి మీ మీ వాహనాలు తీసుకుపోవచ్చునని డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం, మణుగూరు, ఈ బయ్యారం సిఐలు అశోక్ రెడ్డి, నాగబాబు, వెంకటేశ్వర్లు, ఎస్సైలు రంజిత్, సురేష్, మధుప్రసాద్, మనీషా, కానిస్టేబుల్స్, తదితరులు పాల్గొన్నారు.