బీసీ ఉద్యోగుస్తుల్లారా ప్లీజ్ పే బ్యాక్ టు సొసైటీ..
విజ్ఞప్తి చేసిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
పూలే, సాహు మహారాజ్, పెరియార్, అంబేద్కర్ నుండి మండల్ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి, బీసీలకు 27 శాతం రిజర్వేషన్స్ తీసుకొస్తే.. వాటి ఫలితంగా కాస్త విద్యా, ఉద్యోగ రంగంలోకి వచ్చాం అని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు అన్నారు. స్వాతంత్ర తొలినాళ్లలో అంటే 1993 వరకు కేంద్రములో,1973 వరకు రాష్ట్రం లో.. రిజర్వేషన్లు లేక 2, 3 తరాలు నష్టపోయిన జాతి బీసీల జాతి అని అన్నారు. బీసీలకు నేటికి బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీ, ప్రమోషన్ లలో రిజర్వేషన్లు లేవు.. అందువలన కేంద్ర ఉద్యోగాలలో వారి శాతం నేటికీ 22 శాతం దాటలేదు. ఉద్యోగాలు పొందిన బీసీలు గుర్తించు కోవాల్సిన విషయమేమిటంటే మీరు పొందిన ఈ ఉద్యోగాలు ఎందరో బీసీల త్యాగ ఫలితాలు. అందువలన తిరిగి సమాజానికి పే బ్యాక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం బ్రతకటం గొప్ప కాదు.. మన సమాజ అభివృద్ధి కి పని చేయడం కూడా మన భాద్యత.. అప్పుడే మన జీవితానికీ ఒక అర్థం, పరమార్థం అన్నారు. మీరు నిజమైన బిసి ఉద్యమ సంఘాలకు ఆర్ధిక మద్దతు ఇవ్వండి. అది ఆ సంఘాలకు ఊపిరి పోస్తుంది. ఆర్ధిక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న సంఘాలు ఇంకా చురుకైన పాత్ర పోషిస్తాయి. ఆర్ధిక సహాయానికి యాచించాల్సిన అవసరముండదు. ఇంకా నూతన సంఘాలు వచ్చి చురుకైన పాత్ర పోషిస్తాయి..
అలాగే మీ ఓట్లు బీసీ అభ్యర్థుల గెలుపుకు మాత్రమే ఉపయోగించండి.. లేకుంటే బీసీల అభివృద్ధి, సంక్షేమం కొరకు పాటు పడిన మహానుభావుల ఆత్మలు క్షోభిస్తాయి. బిసి రాజకీయ నాయకత్వాన్ని కాపాడండి. మీ ఉద్యోగ నిర్వహణలో బీసీలకు నిబంధనలకు లోబడి సహాయం చేయగలరు. మీ సహాయం వారి జీవితాలను నిలబెట్టవచ్చును.. అలాగే పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఒక విషయం గుర్తుంచుకోండి.. 80 సంవత్సరాల వరకు ఇంకా యువకులమే కాబట్టి మీ శక్తియుక్తుల్ని బీసీ ఉద్యమ వ్యాప్తికి వినియోగించండి.. తద్వారా మీ ఆరోగ్యం బాగుండడమే కాకుండా సమాజానికి మనం ఉపయోగపడేవాళ్ళం అవుతాం..
బీసీలకు బ్యాక్ లాగ్ ఖాళీల పూర్తికి గాని, ప్రమోషన్ల లో రిజర్వేషన్స్ గానీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవాలంటే బీసీ ల ఐక్యతనే పరిష్కారం అని గుర్తు చేశారు. అట్లాగే బీసీ సమాజం దేశ జనాభాలో సగం పైగా ఉన్న రిజర్వేషన్ల విషయంలో 77 సంవత్సరాలుగా బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ వేదికలలలో దేశవ్యాప్తంగా బీసీల వెనుకబాటు తనం ముందుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. బీసీలను రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాస్ గా నిర్వచించటమే వారి వెనుక బాటు తనానికి ఒక కారణమమని అభిప్రాయ పడ్డారు. బీసీ ఉద్యోగులారా రాజ్యాంగ రక్షణ, భవిష్యత్ బీసీ సమాజపరిరక్షణ కొరకు బీసీ ఉద్యోగ సంఘాలు చురుకైన పాత్ర పోషించాలని, ఎస్సీ, ఎస్టీ లను ఆదర్శంగా తీసుకొని తిరిగి సమాజానికి పే బ్యాక్ చేయాలని మన ఓటు మనమే వేసుకొని మన పాలన మనమే చేసుకోవడమే మన సమస్యలకు పరిష్కారం అన్నారు..


