కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి..
పార్టీ నిర్మాణం కోసం సీనియర్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం సేకరణ..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని గల శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా.. బ్లాక్ కాంగ్రెస్, డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది.. దీని కోసం ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిశీలకులుగా ఉన్న మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ ఆధ్వర్యంలో డివిజన్ల, మండల స్థాయిల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ల స్థాయిల్లో పార్టీ నిర్మాణం కోసం సీనియర్ నాయకుల, కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్, డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


