సూచించిన కప్పాటి పాండురంగా రెడ్డి..
మీడియాకు ఒక ప్రకటన విడుదల..
బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో.. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పించి వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంది. మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది.. దీంతో పాటుగా రూ. 500కే గ్యాస్ సిలెండరు, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంట్.. ఇందిరమ్మ ఇండ్లు.. మహిళా సంఘాలకు పెట్రోల్ పంపుల కేటాయింపు లాంటి పథకాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. వారికి తక్కువ వడ్డీకే రుణాలు, ఆర్థిక సహాయం అందిస్తోంది.
మహిళా సంఘాలకు చేయూతలో భాగంగా వారు తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకు ప్రభుత్వం ఇటీవల రూ.344 కోట్లను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకి విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ మహిళాసంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు చెల్లిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శనివారం వరకు చెక్కులను పంపిణీ చేస్తారు. ఆ వెంటనే ఆయా సంఘాల ఖాతాల్లో ఈ నిధులు జమవుతాయి. మహిళా సంఘాల సభ్యులకు అమలు చేస్తున్న ప్రమాద, రుణబీమా పథకాల చెక్కులను సైతం పంపిణీ చేస్తుంది. మహిళా సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తూ చనిపోతే బీమా పథకం కింద ఆమె కుటుంబానికి రూ.10 లక్షలు, రుణాలు తీసుకున్న వారు చనిపోతే వారి పేరిట ఉన్న రుణాల మాఫీని అమలు చేస్తోంది. ఏడాదిన్నరగా రాష్ట్రంలో చనిపోయిన 385 మంది సభ్యుల కుటుంబాలకు ప్రమాద బీమా, 2,502 మంది కుటుంబాలకు రుణ బీమా చెక్కులను పంపిణీ చేస్తుంది అని పాండురంగా రెడ్డి తెలియజేశారు..