బీ. ఎన్. రెడ్డి నగర్ డివిజన్ లో కార్యక్రమం..
పాల్గొన్న డిప్యూటీ కమిషనర్, స్థానిక కార్పొరేటర్..
మంగళవారం రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ లో నిర్వహించిన మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ లు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలలో సమస్యలను పరిష్కరించడంతో పాటు పరిశుభ్రకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మాన్‌సూన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఈఈ రమేష్ బాబు, శానిటేషన్ డిఈ నీలిమ, ఏఈ రవీందర్ రెడ్డి, గోపాలకృష్ణ, కాలనీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, సంజీవరెడ్డి, వెంకట్ రెడ్డి, భూపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, క్రాంతి రెడ్డి, శానిటేషన్ ఎస్.ఎస్. అజీమ్ ఉద్దీన్, జవాన్ యాదయ్య, ఎస్.ఎఫ్.ఏ.లు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు..