సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామానికి చెందిన సంగు ఆంజనేయులు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ సంగు పురేందర్ వంగ రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మృతుని కుటుంబానికి ఐదువేల రూపాయలను నర్సింలు గౌడ్, బెదురు మల్లేశం, పెద్ది రాజు, శివరామ్, బాలకిషన్, సిద్ధులింగం, మహేందర్ తదితరులు కలిసి మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మానవత్వంతో ఆర్థిక సహాయం చేసిన వంగ రాజేశ్వర్ రెడ్డిని ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందించారు.ఇలాంటి సేవలు భవిషత్ లో కొనసాగాలని ఆకాంక్షించారు.


