బీ.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ లో కార్యక్రమం..
సృష్టిలో స్వచ్ఛమైన గాలి, నీరు అందరికీ అందాలన్న కార్పొరేటర్..
శుక్రవారం రోజు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బి.యన్ రెడ్డి నగర్ మెయిన్ రోడ్డు ట్రూ వాల్యూ డివైడర్ వద్ద చెట్ల మొక్కలను బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి నాటడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఈ సృష్టిలో స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఎంతో అవసరం.. అటువంటి గాలి, నీరు కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉండాలి అంటే కచ్చితంగా మొక్కలు అనేవి అధికంగా నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.ఎన్.రెడ్డి నగర్ దేవి పోచమ్మ ఆలయ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు పవన్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్, ట్రూ వాల్యూ మేనేజర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు..