కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
వినికిడి, కీళ్ల నొప్పులు వెన్నునొప్పి సమస్యలకు పరీక్షలు..
హయత్ నగర్ డివిజన్ లోని, రాఘవేంద్ర కాలనీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు రాఘవేంద్ర కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొని, వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగినది.
సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో గల అలీయావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజేబిలిటీస్, సికింద్రాబాద్, భారతీయ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ, ప్రాంతీయ కార్యాలయం, సికింద్రాబాద్ వారు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.. వినికిడి సమస్యలు, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి సమస్యలకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలు, నెక్ బెల్టులు, నడుము బెల్టులు, నీ క్యాప్స్, చేతికర్రలు ఉచితంగా ఇవ్వనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ యొక్క అవకాశాన్ని కాలనీవాసులందరు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, సీనియర్ సిటిజన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..