ప్రమోషన్స్ అనంతరమే ఖాళీలను భర్తీ చెయ్యాలి..
డిమాండ్ చేసిన ఆరోగ్య శ్రీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు..
ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ కి వినతి పత్రం అందజేత..
రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో 50 టీం లీడర్ పోస్టులను ఖాళీల గా చూపించిన రాష్ట్ర ప్రభుత్వం, 18 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్రాలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు టీం లీడర్స్ గా ప్రమోషన్స్ కల్పించిన తర్వాతనే, మిగతా ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. అలా కాకుండా ఎలాంటి అనుభవం లేని కొత్త వారితో టీం లీడర్స్ పోస్టులను భర్తీ చేస్తే 2007 నుండి ఇదే ఉద్యోగం చేస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని, ఇట్టి విషయంపై తమకు న్యాయం చేయాలని ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ పి ఉదయ్ కుమార్ ఐఏఎస్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుమార్, ఉపాధ్యక్షులు సుమన్, హైదరాబాద్ అధ్యక్షులు రాజు, నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగరాజు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు రాసాల శ్రీనివాస్,రాష్ట్ర కమిటీ సభ్యులు, వజ్ర, రవీందర్, జనగాం జిల్లా ఆరోగ్య మిత్ర తదితరులు పాల్గొనడం జరిగింది.


