Monday, June 23, 2025
Google search engine
Homeసినిమారిలీజ్‌కు ముందే ‘పుష్ప 2’ హవా..

రిలీజ్‌కు ముందే ‘పుష్ప 2’ హవా..

పుష్పరాజ్‌ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్‌ఫైర్‌ అనుకుంటూ అల్లు అర్జున్ ట్రైల‌ర్‌తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ ట్రైల‌ర్ సెకండ్స్‌లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వ‌గా అరుదైన రికార్డును సాధించింది ఈ చిత్రం.

అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో తాజాగా 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ చిత్రం. సినిమా విడుద‌ల‌కు ఇంకా 15 రోజులు ఉండ‌గా.. ఇప్పుడే 1 మిలియ‌న్ క‌లెక్ట్ చేయ‌డంతో అమెరికాలో ఈ ఫీట్ సాధించిన ఫ‌స్ట్ సినిమాగా నిలిచింది. అయితే విడుద‌ల‌కు ముందే ఈ రేంజ్‌లో బుకింగ్స్ ఉంటే ఇంకా విడుద‌ల‌య్యాకా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments