Monday, June 23, 2025
Google search engine
Homeస్పెషల్రైల్ ప్రయాణీకులకు గుడ్ న్యూస్..

రైల్ ప్రయాణీకులకు గుడ్ న్యూస్..

ఇప్పటికే చాలా యాప్ లు అందుబాటులో వున్నాయి..
మరో సూపర్ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన రైల్వే..

ప్రయాణికులకు భారతీయ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇప్పటికే చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నా మరో సూపర్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ‘స్వరైల్ యాప్’ పేరిట యూజర్లకు అందుబాటులో ఉంచింది. పాత ‘ఐ.ఆర్.సి.టి.సి. రైల్ కనెక్ట్’ యాప్‌కి కొత్త వెర్ష‌న్‌గా దీనిని తీసుకొచ్చారు. దీన్ని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. ఇది ఆన్‌లైన్‌ రైల్వే సేవలను క్రమబద్ధీకరించడానికి ఆల్-ఇన్-వన్ రైల్వే సర్వీసులకు వేదికగా నిలుస్తుందని వెల్లడించింది. ఇది అనేక రైల్వే సేవలను ఒకే యాప్‌లో అందిస్తుందని పేర్కొంది.

ఈ స్వరైల్‌ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బీటా వెర్షన్‌ అయినా.. ఇప్పటికే ఉన్న రైల్ కనెక్ట్ అకౌంట్‌తో లాగిన్ కావొచ్చు లేదా కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేసుకునే వెసులుబాటు కూడా క‌ల్పించారు. ఇతర రైల్వే యాప్‌ల మాదిరిగా కాకుండా.. ఈ కొత్త స్వరైల్ యాప్‌ను ఆధునిక ఇంటర్‌ఫేస్‌తో రూపొందించారు. సింపిల్ స్టెప్స్‌తో ట్రైన్‌ టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు. అథెంటికేషన్ కోసం ఫేస్ ఐడీ లేదా ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ వంటివి ఉపయోగించొచ్చు. ఈ యాప్‌ హిందీ, ఇంగ్లీష్‌తోపాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments