కాలువల్లో సిల్ట్ తొలగించే పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలన
ఆర్ యూ బీలు నేత మునగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కమిషనర్ మార్గదర్శకాలు..
నగరంలోని వరద నిలిచే రహదారులను పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో నీట మునుగుతున్న రహదారులను పరిశీలించారు.. కొత్తగూడ చౌరస్తాలో ఇటీవల వరద నీరు నిలిచిన ఆర్ యూ బీ పరిశీలన.. అక్కడ ఆటోమేటిక్ డీ వాటరింగ్ పంపులు పని చేయకపోవడంతో ఆర్ యూ బీ నీట మునిగిందంటూ అధికారులు చెప్పారు.. మరమ్మతులు చేయడంతో యిప్పుడు పని చేస్తున్నాయని . ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.. యిక్కడ హైడ్రా పంపులు కూడా అందుబాటులో ఉంచి నీరు నిలవకుండా చూడాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులతో హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీ ఆర్ ఎఫ్ బృందాలు కలసి పని చేయాలని సూచించారు. వరద ముప్పు ప్రాంతాల్లో నిరంతరం సేవలందించే స్టాటిక్ టీమ్ లు ట్రాఫిక్ పోలీసులకు అందుబాటులో ఉండాలన్నారు.
జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ కర్ణన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తో పాటు జీ హెచ్ ఎం సి అధికారులు కూడా బయోడైవర్సిటీ ప్రాంతంలో నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు. వంతెనల మీద కూడా నీరు పోయే రంధ్రాల్లో మట్టి చేరకుండా కూడా చూడాలని హైడ్రా కమిషనర్ సూచించారు. అనంతరం గచ్చిబౌలి లోని ఇంద్రానగర్లో గమన్ ఆసుపత్రి వద్ద నీరు నిలిచిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రధాని రహదారి మీదుగా వచ్చిన వరద నీరు వెళ్లేందుకు అవకాశం లేకుండా అక్కడ గతంలో ఉన్న నాలా కబ్జా అవ్వడంతో వరద నీరు గమన్ హాస్పిటల్ లోతట్టు ప్రాంతాలను మంచుతో దాని స్థానికులు ఫిర్యాదు చేసారు. వెంటనే ఆ వరదనాలాను రివైవ్ చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వర్షం పడినప్పుడు వరదతో పాటు పెద్దమొత్తంలో చేరుతున్న సిల్ట్ ను వెనువెంటనే తొలగించాలని చెప్పారు. అనునిత్యం అప్రమత్తంగా ఉండి వరద నివారణతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.