కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..
వెల్లడించిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..
బుధవారం రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ పురం కాలనీ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి కాలనీలో పర్యటించడం జరిగింది.
ఈ సందర్భంగా కాలనీవాసులు కాలనీలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి కుప్పలుగా ఉన్నాయనీ వాటిని వెంటనే తొలగించాలని కార్పొరేటర్ ని కోరడం జరిగింది..
ఈ సందర్భంగా కార్పొరేటర్ సంబంధిత విభాగం సిబ్బందితో కాలనీలో పేరుకుపోయిన చెత్తకుప్పలను తొలగించడం జరుగుతుందని, ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రపరచుకోవాలని సంబంధిత పారిశుద్ధ్య కార్మికులకు సూచనలు ఇవ్వడం జరిగింది.. వీలైనంత త్వరగా కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని కాలనీవాసులకు హామీ ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమంలో పద్మా రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ముత్యంరావు, చంద్రయ్య, నారాయణరెడ్డి, విఠల్ రెడ్డి, సికిందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, వెంకటరమణారెడ్డి, డాక్టర్ శిరీష్ కుమార్, దామోదర్ రావు, సూర్య వర్ధన్ రెడ్డి, జీ.హెచ్.ఎం.సి. ఎస్.ఎస్. అజీమ్ ఉద్దీన్, జవాన్ యాదయ్య, ఎస్.ఎఫ్.ఏ. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు..