శ్రీశైలం:
ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మంగళవారం శ్రీశైల భ్రమరాంభికా మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున భక్త సమాజం అధ్యక్షుడు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్, కోట సుదర్శన్ రెడ్డి, నాగరాజు గౌడ్, హరినాథ రావు, ముకేశ్, లోతుకుంట వినోద్ గౌడ్, శివ గౌడ్, లక్షణ్, గిరి, ఆంజనేయులు, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


