తమ శిష్యులను ఆశీర్వదించి హితోపదేశం చేసిన దుత్పల శ్రీనివాస్ దంపతులు..
గురు పౌర్ణమి సందర్భంగా ఆత్మీయ కార్యక్రమం..
అడిక్ మెట్ లో అపురూప దృశ్యకావ్యం..
గురువు ఆశీర్వదిస్తే విద్య, వినయం, సంపద, ఆరోగ్యం సిద్ధిస్తుంది..

నేడు గురుపౌర్ణమి.. ఈ శుభదినాన భవిష్యత్తుపై భరోసా కల్పించి, మోక్షమార్గం చూపించిన గురువులను పూజించుకోవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. ఆది గురువు శ్రీ దత్తాత్రేయ స్వామీ వారి శిష్య పరంపర కొన్ని దశాబ్దాలుగా ఈ భారతావనిలో విస్తరించింది.. ఈ కోవలోకే వస్తారు పూజ్యశ్రీ దుత్పల శ్రీనివాస్ గురుదత్త.. ఈయన ఎన్నో ఏళ్లుగా గురుముఖంగా సాధన చేసి అపారమైన శక్తి సామర్ధ్యాలు పుణికిపుచ్చుకుని.. తన శిష్యులను ఎప్పటికప్పుడు కరుణిస్తూనే ఉన్నారు.. ఈ మహనీయుని సతీమణి మంజుల సైతం తన పతిదేవుని మార్గంలోనే పయనిస్తూ.. శిష్యులను తన కన్నబిడ్డలవలె చూసుకుంటూ.. అన్నపూర్ణాదేవిగా వెలుగొందుతున్నారు.. పూజ్యశ్రీ శ్రీనివాస్ గురుదత్త తాను అకుంఠిత దీక్షతో సాధించిన శక్తివంతమైన విద్యలను మనిషి మోక్ష సాధనకు ఉపయోగపడేలా తన శిష్యులకు బోధిస్తూ మహా పుణ్యకార్యాన్ని సలుపుతూ ఉన్నారు.. ఈక్రమంలో ఈ పవిత్ర దంపతులను వారి శిష్యబృందం ఘనంగా సన్మానించుకుని, వారి ఆశీస్సులు తీసుకున్నారు.. ఇక ఈ సందర్భంగా అన్నపూర్ణగా వెలుగొందుతున్న మంజుల మాత శిష్యులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేసి కొసరి కొసరి వడ్డించారు.. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఈ గురు దంపతుల సూచనలు పాటించి, వారి ఆశీస్సులు తీసుకుంటే ఇట్టే తొలగిపోతాయి..
ఈ పవిత్ర కార్యక్రమంలో శిష్యబృందం విష్ణు కిషోర్, రమణ, శేఖర్, సాయికుమార్ యాదవ్, నరసింహ, ప్రముఖ గాయకుడు తులసీరాం , రాజ్ కిరణ్ తదితరులు పాల్గొన్ని పూజ్య గురు దంపతులకు సేవ చేసుకుని, సన్మానించుకుని వారి కరుణాపూరితమైన ఆశీస్సులు అందుకున్నారు..