గతం గుర్తుచేసిన కప్పటి పాండురంగా రెడ్డి..
అన్నీ మర్చిపోయి ప్రోటోకాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
మీరు ప్రొటోకాల్ విషయంలో ఇంతగా ఆందోళన చెందుతున్నారు కదా.. మీరు 2018 లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గా గెలుపొంది.. అధికారంలో ఉన్న బీ.ఆర్.ఎస్.లోకి వెళ్లి మంత్రి అయ్యారు కదా… మీరు ఇలాంటి యవ్వారాలే చేశారు కదా.. ఎన్నోసార్లు మీరు అధికారిక కార్యక్రమాలను మీ పార్టీ కార్యక్రమాల లాగా నిర్వహించిన విషయం మీరు మర్చిపోయారా… అవన్నీ మీకు గుర్తుకు రావడం లేదా..
మీర్ పేట్, జిల్లెలగూడ చెరువుల ట్రంక్ లైన్ శంఖుస్థాపన కార్యక్రమాన్ని మీరు మర్చిపోయారా? మాకైతే గుర్తుంది… ఆరోజు మీరు వ్యవహరించిన తీరు.. పార్టీ కార్యక్రమం అనేదానికంటే మీ సొంతింటి కార్యక్రమం లాగా నిర్వహించింది ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ చెప్పుకుంటారు.. ఆరోజు స్టేజి మీద కూర్చున్న మీ కుమారుడు కార్తీక్ రెడ్డి ఏ హోదాలో ఉన్నాడు.. KTR పక్కన కూర్చున్న తీగల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాదా?.. మాజీ ఎంపిపి తీగల విక్రం రెడ్డి చేత ఓట్ ఆఫ్ థాంక్స్ చెప్పించింది మీరే కదా…
అంతెందుకు.. మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్.. ప్రభుత్వానిదే కదా.. అందులో జరిగేవన్ని పార్టీ కార్యక్రమాలే కదా.. మీ పార్టీ వాళ్లు తప్ప ఎవరైనా అందులోకి వస్తున్నారా…
ఇవన్నీ మర్చిపోయి.. ప్రొటోకాల్ పాటించడం లేదని రగడ చేయడం ఎంతవరకు సమంజసం.. ఏమీ చేయలేక రాజకీయం చేయడం తప్ప ఇంకోటి కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరించారు రంగా రెడ్డి జిల్లా మాజీ గ్రంధాలయ చైర్మన్ కప్పటి పాండురంగా రెడ్డి..


