Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణసరూర్ నగర్ కట్టను సందర్శించిన రాచకొండ సీపీ..

సరూర్ నగర్ కట్టను సందర్శించిన రాచకొండ సీపీ..

నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన..
అధికారులకు సూచనలు..

గురువారం రోజు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్ నగర్ కట్టను రాచకొండ సిపి సుధీర్ బాబు, ఐపిఎస్ సందర్శించి.. చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఇప్పటివరకు 3వేల గణనాధులు నిమజ్జనం కాగా, ఇంకా 20 వేల విగ్రహాల వరకు రాచకొండ పరిధిలోని పలు చెరువులు కుంటలలో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.. అలాగే ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ఆటంకం కలగకుండా అధికారులు, పోలీసులు, షీ టీమ్స్, ఎస్ఓటీ టీం, మెడికల్ ట్రీట్మెంట్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉంచామని సుధీర్ బాబు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పరిశీలించి అధికారులకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 12 వేల మంది పోలీసు అధికారులతో ఈ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులతో కలిసి సరూర్ నగర్ చెవులో ఉన్న బోటులో ఎక్కి అక్కడి వాతావరణాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.సిపి వెంట డిసిపిలు, అడిషనల్ డీసీపీలు, ఏసిపిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments