లింగోజి గూడ డివిజన్ లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు..
వివరాలు వెల్లడించిన అధికారులు..
ఎల్.బీ. నగర్ నియోజకవర్గం, లింగోజి గూడ డివిజన్ లోని సీఎం రోడ్, సరూరునగర్ సరస్సు సంబంధించిన పనులకోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం కొరకు మొత్తం రూ. 35. 98 కోట్లు నిధుల కేటాయింపు జరిగింది.. ఇక చేపట్టిన పనుల వివరాలకొస్తే
శారదా వైన్స్, ఎల్.బి. నగర్ నుండి సరూరునగర్ సరస్సు అంటే ప్రియదర్శిని పార్కు వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం జరుగనుంది దీనికోసం స్టాండింగ్ కమిటీలో నిధులు మంజూరై క్లియర్ చేయబడింది..
వంతెన నిర్మాణం కొరకు మంజూరైన మొత్తం నిధులు రూ. 35.95 కోట్లు.. ఈ నిధులతో ప్రియదర్శిని పార్కు సమీపంలో సరూరునగర్ సరస్సు వద్ద వంతెన నిర్మాణం చేబడతారు.. ఇది కూడా స్టాండింగ్ కమిటీ లో మంజూరై క్లియర్ చేయబడింది.
ఇక సరూరునగర్ సరస్సు బండ్ల బలోపేతం, మరమ్మతులు నిమిత్తం మంజూరైన మొత్తం పైకం రూ. 5.60 కోట్లు.. ఇందులో భాగంగా సరూర్ నగర్ సరస్సు ప్రధాన బండ్ల బలోపేతం, మరమ్మతులు చేపడతారు.. ఇది కూడా స్టాండింగ్ కమిటీలో మంజూరై క్లియర్ చేయబడింది..
ఇక సరూరునగర్ బండ్, గ్రీస్ పార్క్, తపోవన్ కాలనీ కనెక్టింగ్ బండ్ నిర్మాణం, అందంగా తీర్చిదిద్దడం కోసం మంజూరైన మొత్తం నిధులు రూ. 4.50 కోట్లు.. దీని కింద బండ్, గ్రీస్ పార్క్, తపోవన్ కాలనీ కనెక్ట్ చేసే నిర్మాణాలను అందంగా తీర్చిదిద్దే పనులు చేపట్టనున్నారు..
