Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..

కార్యక్రమంలో పాల్గొన్న మధుయాష్కీ గౌడ్.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదలకు పక్షపాతిగా ఉంటుందని వెల్లడి..

సీఎం రిలీఫ్ ఫండ్ పొందడం ద్వారా ఎంతోమంది పేదలు ఆర్థికంగా ఉపశమనం పొందగలుగుతున్నారని, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న సామాన్యులకు వైద్యభారం తగ్గుతుందని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందిన ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు మధుయాష్కీని సంప్రదించగా.. స్పందించిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారు. సదరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎల్బీనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షమేనని వారి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఎంతోమంది సీఎం రిలీఫ్ ఫండ్ పొందడం ద్వారా ఆర్థిక ఉపశమనం పొందగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హయత్ నగర్ కు చెందిన బండారి లలితకు రూ.30,000/- , నాగోల్ కు చెందిన కె .సుధాకర్ కు రూ.60,000/-, బి.యన్.రెడ్డి నగర్ కు చెందిన వి.ఈశ్వరికి రూ.47,500/-, చంపాపేటకు చెందిన బి. సుశ్రేయకు 50,000/, చింతలకుంట చెందిన కోడి లక్ష్మీనారాయణకు రూ.60,000/-, హయత్ నగర్ కు చెందిన గోపగాని వెంకటయ్యకు రూ.60000/-, హయత్ నగర్ కు చెందిన వినుకొండ మధుకర్ చారికి రూ.60,000/-, ఎల్బీనగర్ ఉప్పల ఉమామహేశ్వరికి రూ.60,000/-, కొత్తపేట దోసపాటి వీరేందర్ కు రూ.60,000/-, దిండు మణికృష్ణ గౌడ్ కు రూ.38,500/-, పెరుమాండ్ల వర్ధన్ కు రూ.44,500/- లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments