Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణస్టాండింగ్ కమిటీ లో 9 అంశాలు, 4 టేబుల్ ఐటమ్ లకు కమిటీ ఆమోదం..

స్టాండింగ్ కమిటీ లో 9 అంశాలు, 4 టేబుల్ ఐటమ్ లకు కమిటీ ఆమోదం..

నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం..
సమావేశంలో పాల్గొన్న అధికారులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు..

నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం లో జరిగింది. కమిటీ సమావేశంలో 9 అంశాలు, 4 టేబుల్ ఐటమ్ లకు సభ్యులు ఆమోదించినట్లు మేయర్ తెలిపారు. 

ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, డా.ఆయేషా హుమేరా, మహమ్మద్ సలీం, మహాలక్ష్మి రామన్ గౌడ్, సి.ఎన్.రెడ్డి, మహమ్మద్ గౌస్ ఉద్దీన్, వి.జగదీశ్వర్ గౌడ్, బూరుగడ్డ పుష్ప పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ లు రఘు ప్రసాద్, సత్యనారాయణ, వేణుగోపాల్, సుభద్ర, పంకజ, గీతా రాధిక, మంగతాయారు, జోనల్ కమిషనర్ లు  హేమంత్ సహదేవ్ రావు, అపూర్వ్ చౌహాన్, రవి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ సిసిపి గంగాధర్, సి ఈ లు  భాస్కరరెడ్డి, సహదేవ్ రత్నాకర్, లేక్స్ ఈఈ నారాయణ, అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

స్టాండింగ్ కమిటీ ఎజెండా అంశాలు :

1.   ఎల్ బి నగర్ జోన్ హయాత్ నగర్ సర్కిల్ వార్డు నంబర్ 11 లో గల కుమ్మరి కుంట చెరువు నుండి రాఘవేంద్ర కాలనీ బస్ డిపో  వరకు 600 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి టెండర్ పిలుచుటకు పరిపాలన అనుమతి కి కమిటీ ఆమోదం.

  1.  సి ఆర్ ఎం పి రెండో దశలో 1142. 54 కిలోమీటర్లు రూ. 2828 కోట్లు వ్యయంతో ( 2025 నుంచి 2030) వరకు  5 ఏళ్ల వరకు పాత  టర్మ్స్ అండ్ కండిషన్ 5 ఏళ్ల పాటు  జోన్ వారిగా ప్యాకేజీ తో చేపట్టేందుకు పెండింగ్ అప్రూవల్ తో  ప్రభుత్వానికి సిఫారసు చేయుటకు రివైజ్డ్ అంచనా  వ్యయం మంజూరు కు అనుమతి  కోరుతూ కమిటీ ఆమోదం.
  2. (ఏ) కూకట్ పల్లి సర్కిల్ వార్డు నెంబర్ 120 లోగల బాలానగర్ ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ ఏరిన నిర్వహణ కు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలుచుటకు కమిటీ ఆమోదం.

(బీ) ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్ ధర ప్రకారం ఏడాదికి రూ.1,35,550 రెంటల్ చార్జెస్ చెల్లించుటకు అనుమతిస్తూ కమిటీ ఆమోదం.

  1. చార్మినార్ జోన్, చార్మినార్ పాత బస్టాండ్ వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణానికి( DBFOT)  డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ ఆపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్ బేసిస్ ప్రకారంగా 15 సంవత్సరాలు, ఆ తర్వాత మరో 5 ఏళ్ల పాటు పెర్ఫార్మెన్స్ కండిషన్  ప్రకారంగా పెంచేందుకు అనుమతిస్తూ కమిటీ ఆమోదం.
  2.  ఈ ఈ ఎస్ ఎల్ కాంట్రాక్ట్ ముగిసినందున, ఎక్స్టెన్షన్ అప్ ఇంట్రెస్ట్ సమగ్ర ఆపరేషన్, నిర్వహణ కాంట్రాక్ట్ తో పాటు ప్రస్తుతం  నిర్వహిస్తున్న ఎల్ ఈ డి వీధి లైట్స్, ccms బాక్స్ లు, ఎల్ ఈ డి లైట్లు,  ccms ప్యానెల్ పోల్ కేబుల్, పోల్ బాక్స్/ విండోలు  యాక్సెసరీస్  పాత స్తంభాలు ఆపరేషన్  నిర్వహణతో పాటుగా అదనపు కొత్త ఎల్ ఈ డి పిక్చర్స్, సి సి ఎం ఎస్  ఏర్పాటు రూ.897 కోట్ల రూపాయలు (18 శాతం జి ఎస్ టి) తో అంచనా తో  సిఫార్సు చేయగా పరిపాలన అనుమతి తో పాటు గా టెండర్ పిలుచుటకు సిఫార్సు కి కమిటీ ఆమోదం.

6.  ఖైరతాబాద్ జోన్ లో వివిధ ప్రాంతాలలో స్మార్ట్  పార్కింగ్ మౌలిక వసతులు, డిజిటల్ సపోర్ట్  కోసం ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలువగా అర్హత కలిగిన రెండు బిల్డర్స్ జ్రూతి సొల్యూషన్స్, జూకె టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ( ఆర్ పి ఎగ్) ప్రతిపాదనలు క్వాలిఫై ఆయన బిల్డర్స్  అనుమతి కోరగా కమిటీ ఆమోదం.

7.  (ఏ) గోషామహల్ సర్కిల్ లో గల బేగం బజార్ ఫిష్ మార్కెట్ డిప్యూటీ కమిషనర్  టెండర్ కమ్ ఓపెన్ యాక్షన్  కౌన్సిల్ చేయగా 16 స్టాల్ లు తో పాటుగా 15 స్టాల్స్ కు సాధారణ రెట్ల కు పలికారు.

(బీ).  ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి తెలంగాణ మత్స్యకారుల సహకార సంఘం సమాఖ్య యొక్క అభ్యర్థనను పరిగణలోనికి తీసుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ననుసరించి ఫ్లోర్ వారిగా అద్దె/ లీజు ప్రకారం కిరాయి చెక్కించాలి. ఇంతకు ముందు ఉన్న ఎండు చేపల వ్యాపారులకు 16 దుకాణాలు కు గాను 15 స్టాల్స్  ఆర్డినరీ రేట్స్ కేటాయించడానికి, తెలంగాణ  ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మెన్ లేఖను పరిగణలోకి తీసుకొని మిగిలిన స్టార్స్ ప్రభుత్వ ఉత్తర్వు 25 తేదీ 31.01.2018 లీజు ప్రాపర్టీ రెన్యువల్ ను ప్రభుత్వ ఉత్తర్వు 5.2.2911 ననుసరించి  ఫ్లోర్ వారిగా లీస్/ అద్దె చార్జెస్ ప్రభుత్వ ఉత్తర్వు 25, తేదీ 3.1.2018 ప్రకారం ఇచ్చుటకు.

(సి)  పిటిషనర్ డబ్ల్యు.పీ. 3291/4099/2025 ప్రకారంగా 9 ఎండు  చేపల విక్రయదారులకు కేటాయించిన పాత  స్టాల్ యజమానులు అద్దె చెల్లించిన రషీదులు ప్రూఫ్ కొరకు సమర్పించాలి. 

  1. జిహెచ్ఎంసి  హెల్త్ సెక్షన్ హెడ్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న  ఈ. వెంకటేష్  తో పాటు ఇతరులకి పదోన్నతి కల్పించుటకు కమిటీ ఆమోదం.
  2. జులై మాసానికి సంబంధించిన ఆదాయ వ్యయాల సమాచారాన్ని  వివరించుట కమిటీ ఆమోదం.

టేబుల్ ఐటమ్స్ :
1.  హయత్‌నగర్ సర్కిల్-3లోని నాగోల్ చెరువు నుండి వేంకటరామణ కాలనీ వరకు మూసీ నది లోకి వెళ్లే SWD RCC బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.500.00 లక్షల వ్యయంతో పరిపాలనా అనుమతి – కార్పొరేషన్‌కి సిఫార్సు – ఆమోదం కోరడమైనది.

2.  బంజారా హిల్స్‌ లో రోడ్ నం.5 నుండి స్ట్రీట్ నం.1 వరకు (జేవీఆర్ బంజారా అవెన్యూ) హైదర మంజిల్‌ నుండి కలివా హౌస్‌ వరకు 18 మీటర్ల వెడల్పుతో రోడ్డు అభివృద్ధి ప్రణాళిక. దీనికై ప్రభావితమయ్యే 30 ఆస్తుల స్వాధీనానికి అనుమతి – కార్పొరేషన్‌కి సిఫార్సు – ఆమోదం కోరడమైనది.

3.  సీఈ (లేక్స్) సమర్పించిన ప్రతిపాదన:  ఏ) 31.10.2025 వరకు మిగతా పనులు, తుది బిల్లులు పూర్తి చేయుటకు ఏ.పీ.డీ.ఎస్.ఎస్. (సి) కింద మెసర్స్ బీపీఆర్ ప్రాజెక్ట్స్ కి అనుమతి.

బీ) మిగతా పనుల కోసం రూ. 2,04,31,740 (రూ.2,04,48,016 – రూ.16,276) విలువతో పాత రేట్లపైనే (–16.89 శాతం తగ్గింపు) ఒప్పందం కుదుర్చుటకు అనుమతి.

సి) ప్రైమ్ ఏజెన్సీ అయిన మెసర్స్ శ్రీ ఒర్సు మారుతి – పనులు పూర్తయ్యే వరకు, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌ వరకు, చెల్లింపులు పూర్తి అయ్యే వరకు హోల్డ్‌లో ఉంచబడును.

4.  శేరిలింగంపల్లి జోన్‌ లో అంబేడ్కర్ కాలనీ నుండి సిషుమందిర్ ప్రాంతం (తిమ్మక్క చెరువు) వరకు వర్షపు నీటి కాలువ నిర్మాణానికి రూ.560.00 లక్షల వ్యయంతో, SNDP నిధుల నుండి ఖర్చు చేయుటకు పరిపాలనా అనుమతి – కార్పొరేషన్‌కి సిఫార్సు – ఆమోదం కోరడమైనది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments