Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణస్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి సర్వే..

స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి సర్వే..

కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..
హాజరైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు..

శనివారం రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఏపీఆర్ క్రిస్టల్ విల్లాస్ దగ్గర నుంచి మహాలక్ష్మి నగర్ కాలనీ వరకు స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మించేందుకు రాచకాలువను సంబంధిత అధికారులతో సర్వే నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీఈ శుక్లజ, సర్వేయర్ జ్యోతి లతో కలిసి సర్వే నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ త్వరలోనే స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ప్రారంభమవుతాయని, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ సతీష్, హైడ్రా ఎస్.ఐ. ముజాఫర్, లా అండ్ ఆర్డర్ ఎస్.ఐ. అనిల్, జలమండలి మేనేజర్ సిరివెన్నెల, ఇంజనీరింగ్ విభాగం ఏఈ కార్తీక్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ రవీందర్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments