ఈనెల 20 న ” రాజీవ్ గాంధీ ఖేల్ ఉత్సవ్ రన్ “
సంబంధిత పోస్టర్, టి షర్ట్ ల ఆవిష్కరణ..
పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు..
మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించనున్న “రాజీవ్ గాంధీ ఖేల్ ఉత్సవ్ రన్ ” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, టీ షర్ట్ లను సోమవారం రోజు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ లు ఆవిష్కరించారు. కొత్తపేట నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ రన్ కార్యక్రమంలో క్రీడాకారులు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు సూచించారు. స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులు దొంతి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి, నాయకులు లింగాల కిషోర్ గౌడ్, పాశమ్ అశోక్ గౌడ్, వేణు యాదవ్, గణేష్ నాయక్, కంచర్ల కవిత, భాను, జాంగిర్ బాబా గౌడ్, నిరంజన్ యాదవ్, అంతటి శ్రీనివాస్ గౌడ్, రేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


