కార్యక్రమం ఏర్పాటుచేసిన వనస్థలిపురం పెయింటర్స్ అసోసియేషన్..
కార్మికులకు ఈ శ్రామ్ కార్డులు అందించిన కార్పొరేటర్..
హయత్ నగర్ డివిజన్ లోని బీడీఎల్ కాలనీలో వనస్థలిపురం పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు.. అనంతరం ఆయన కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఈ శ్రామ్ కార్డ్స్ పెయింటర్స్ కార్మికులకు అందించడం జరిగింది.. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి అనేక పథకాలను అమలు చేస్తుందని, ముఖ్యంగా, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం, 2008 అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించబడింది.. ఈ చట్టం కింద, జీవిత బీమా, వైకల్య బీమా, ఆరోగ్య బీమా, ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య పింఛను వంటి ప్రయోజనాలు అందించబడతాయని, కావున కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల సూర్య రాజు, కార్యవర్గ సభ్యులు రాములు, తిరుపతయ్య, రవి కుమార్, బాల క్రిష్ణ, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..


