తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై కఠిన విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పోల్చి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ వ్యయపరంగా, సాగునీటి పరంగా పూర్తిగా వైఫల్యమని ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు.
హరీష్‌రావు తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు:
- కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు రూ.84,000 కోట్లు కాగా, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం.
- ఇందులో నీటి వినియోగం 240 TMC.
- కానీ ప్రాణహిత–చేవెళ్ల (తమ్మిడి హెట్టి – ఎల్లంపల్లి) ప్రాజెక్ట్ ఖర్చు రూ.35,000 కోట్లు.
- సాగునీరు అందే ఎకరాలు కేవలం 4.47 లక్షలు మాత్రమే.
- నీటి వినియోగం కేవలం 80 TMC.
“మూడో వంతు ఖర్చు పెట్టి, పదోవంతు ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని ప్రాజెక్ట్. 35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం. అమోఘం. ఇదేనా కాంగ్రెస్ ఇంజనీరింగ్ నైపుణ్యం? ఇదేనా అసలైన మార్పు?” అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు.


