కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..
అమ్మవారికి ప్రత్యేక పూజలు.. కాలనీ వాసులకు శుభాకాంక్షలు..
బోనాల పండుగ సందర్భంగా ఆదివారం రోజు హస్తినాపురంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ దుర్గ పోచమ్మ తల్లి అమ్మవారి బోనాల ఉత్సవాల కార్యక్రమంలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. తెలంగాణ సంస్కృ తి, సంప్రదాయాలను తెలిపే బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు భూపతిరెడ్డి, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, చిన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు..