అథర్వ మురళి హీరోగా రూపొందిన డీ. ఎన్. ఏ. ..
కథనాయికగా తళుక్కుమన్న నిమిషా సజయన్..
‘ఫర్హానా’ దర్శకుడి మరో కొత్త ప్రయత్నం..
కిడ్నాప్ చేయబడిన పసిబిడ్డ చుట్టూ తిరిగే కథ ఇది..
తమిళంలో హీరోగా అథర్వ మురళికి మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరోగా చేసిన సినిమానే ‘ డీ ఎన్ ఏ ‘.. నెల్సన్ వెంకటేశన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. నెల్సన్ వెంకటేశన్ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే సినిమా ‘ఫర్హానా’. ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి దర్శకుడు రూపొందించిన సినిమా ఇది.
అథర్వ మురళి సరసన నిమిషా సజయన్ నటించింది. ఈ సినిమాలో ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమాను జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ .. మలయాళ .. కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది.
ఈ సినిమాలో హీరో – హీరోయిన్ భార్యాభర్తలు. తొలి సంతానం విషయంలో వాళ్లిద్దరూ ఎన్నో కలలు కంటారు. వారికి ఒక బిడ్డ కలుగుతుంది. అయితే ఆ బిడ్డ తమ బిడ్డ కాదనే అనుమానం వారికి కలుగుతుంది. DNA టెస్ట్ చేయించడంతో వారి అనుమానం నిజమవుతుంది. తమ బిడ్డ ఏమైపోయింది? ఎవరు కిడ్నాప్ చేయించారు? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ జంట చేసే పోరాటమే ఈ సినిమా.