ఎల్బీనగర్:
చైతన్యపురిలోని జీఎన్ఆర్ చైతన్య హై స్కూల్ మరోసారి తన ప్రతిభను జాతీయ స్థాయిలో ఘనంగా చాటుకుంది. ప్రతిష్టాత్మకమైన (నేషనల్ సైన్స్ ఒలింపిడ్) పరీక్షలో పాఠశాలకు చెందిన14 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించి విశిష్ట విజయాన్ని నమోదు చేశారు.ఈ సువర్ణ విజయంతో పాఠశాల విద్యా ప్రమాణాలు మరోసారి రుజువయ్యాయి. నాణ్యమైన బోధన, బలమైన పునాది (ఫౌండేషన్ బేసిక్స్), క్రమబద్ధమైన శిక్షణా విధానం, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభ అత్యంత వైభవంగా జరిగింది. పాఠశాల చైర్మన్ జి. నరేందర్ రెడ్డి స్వయంగా విజేతలకు గోల్డ్ మెడల్స్ అందజేసి సత్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ,“మన పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, బలమైన పునాది, క్రమశిక్షణతో కూడిన శిక్షణా విధానం వల్లే మన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిరంతరం విజయ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తున్నాను” అని ప్రేరణాత్మకంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, డీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలను అభినందించారు.జీఎన్‌ఆర్ చైతన్య హై స్కూల్ విద్యార్థుల సమగ్రాభివృద్ధి దిశగా నాణ్యమైన విద్యా సేవలను అందిస్తూ ఎల్లప్పుడూ ముందంజలో కొనసాగుతోంది.


