Monday, June 23, 2025
Google search engine
Homeట్రెండింగ్‌24 గంటల పాటు భిక్షాటన చేసిన యువకుడు..

24 గంటల పాటు భిక్షాటన చేసిన యువకుడు..

ఎంత డబ్బులు వచ్చాయో తెలిస్తే మతి పోతుంది..

ఏదో విధంగా జనాన్ని ఆకర్షించాలి. ఏం చేసైనా ప్రజల చూపును తమవైపు తిప్పుకోవాలి. కొత్తగా ఏదైనా చేయాలనే తపనకు కాస్త క్రియేటివి జోడించి కుర్రాళ్లు సోషల్ మీడియాలో నయా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. టిక్‌టాక్, రీల్, షార్ట్ వీడియోలు పాతవైపోవడంతో ఇప్పుడు ప్రాంక్ వీడియోలపై పడ్డారు. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్, కామెంట్స్ కోసం వెరైటీ స్టంట్స్ చేస్తున్నారు.కోల్‌కతాకు చెందిన ఓ యువకుడు ఇంకొంచెం కొత్తగా ట్రై చేశాడు.

యువకుడు 24గంటల పాటు చేసిన పని చూసి కొందరు ఇదో కొత్త రకం ఉపాధి అంటూ కామెంట్స్ చేస్తుంటే..మరికొందరు ఇదేం పోయే కాలం అంటూ చివాట్లు పెడుతున్నారు. అసలు యువకుడు చేసిన ఘనకార్యం ఏమిటంటే 24 అవర్స్ బెగ్గింగ్ ఛాలెంజ్(24గంటల పాటు భిక్షాటన సవాల్) పంతా ద లాస్ట్ రూల్ నెంబర్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈవీడియోని షేర్ చేశాడు.ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది.

జనం దృష్టిని ఆకర్షించడమే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల టార్గెట్. అందుకే కొత్తగా ఉండే కంటెంట్ లేదా కామెడీగా ఉండే వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కోల్‌కతాకు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ 24గంటల పాటు రోడ్లపై తిరుగుతూ భిక్షటన చేశాడు.చిరిగిన వైట్ టీషర్ట్, జీన్స్ వేసుకున్న యువకుడు చేతిలో స్టీల్ గిన్నెతో పాటు మొబైల్ ఫోన్ పట్టుకొని రోడ్ల వెంట తిరిగాడు. దారిలో కనిపించిన వాళ్లను, ఫుట్‌పై నడుచుకుంటూ వెళ్లే వారిని ఎంతో కొంత దానం చేయమని అడుక్కున్నాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments